మాజీ మేయర్ ఏసురత్నంను కలిసిన పెమ్మసాని
గుంటూరు, మహానాడు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది…ప్రజలు మార్పు కోరుకుంటున్నారు…ప్రజలకు అండగా అందరం కలిసి పనిచేద్దామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పొట్టి శ్రీరాములు నగర్‌లో మాజీ మేయర్ చుక్కా ఏసురత్నంను బుధవారం పెమ్మసానితో పాటు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి బుధవారం మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో నీరు, డ్రైనేజ్‌తో పాటు ఇతర సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసు రత్నం మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో మార్పు కోరే నాయకులకు తమ మద్దతు ఎల్లప్పు డూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్, క్లస్టర్ – 3 ఇన్‌చార్జ్ కసుమర్తి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షుడు మర్రిపాటి శ్రీనివాస్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు రావెళ్ల వెంకటయ్య, నైనం లక్ష్మీనారాయణ, బూత్ ఇన్‌చార్జ్ మట్టు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.