దుర్గమ్మ ఆశీస్సులు
దసరా నవరాత్రులు
చెడుపై మంచి విజయం
లోకానికి వెలుగులు
దసరా వెలుగులు
మనలో చీకటికి విముక్తి
జ్ఞానపు చేతులు
అసుర సంహార గుర్తులు
రుద్రరూపం చూపిస్తూ
భద్రకాళి తాండవం
కమ్ముకున్న చీకట్లను
అంతమొందించే ఆదిశక్తి
దుష్ట గుణ సంహారం
మహిషాసుర మరణం
లోక రక్షణార్థం యుద్ధం
స్త్రీ శక్తి స్వరూప విజయం
కామాంధులను శిక్షిస్తూ
మద గర్వం అణిచే
మహిళా శక్తి ప్రదర్శించి
అజ్ఞానం నిర్మూలనం కావించే
చెడు గుణాలు నిర్మూలిస్తే
మనిషి తేజోమూర్తి
రాక్షస క్రీడ అంతమే
మనసంతా ప్రశాంతం
నవభక్తి పూజా విధానం
నవరాత్రుల పుణ్యం
శక్తి స్వరూపి ఆశీస్సులు
సకల జగత్తుకు రక్షణ
దుర్గామాత నవ రూపాలు
దివ్య సందర్శన అనందం
నిత్య అలంకారాలు
సత్య మార్గపు బోధనలు
రాముని విజయం
రావణుని వినాశనం
పర స్త్రీ వ్యామోహం
వంశ నాశనం ప్రస్థానం
– కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235