Mahanaadu-Logo-PNG-Large

వాలంటీర్‌ ఇంట్లో నాటుబాంబులు

పోలీసుల తనిఖీల్లో లభ్యం..తండ్రి వైసీపీ నేత
ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ

పల్నాడు జిల్లా : ఎన్నికల పోలింగ్‌ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్‌ అయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్‌ సమ యంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పోలీసుల అలర్ట్‌ అయ్యారు. కౌంటింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బెల్లంకొండ నాగిరెడ్డిపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ వాలంటీర్‌ ఇంట్లో నాటు బాంబులు కనిపించా యి. వెంటనే వాటిని సీజ్‌ చేశారు. వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వాలంటీర్‌ తండ్రి వైసీపీకి చెందిన నాయకుడు కావడం మరో విశేషం. దీంతో వాలంటీర్‌ను, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపు తున్నారు. కొద్దిరోజులకు ముందు కూడా పలువురు వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులు దొరికాయి. జిల్లాలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోల్‌ బాంబులు, నాటు బాంబులు లభించాయి. ఇప్పుడు నాగిరెడ్డిపాలెంలో నాటు బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి అల్లర్లు సృష్టిస్తారోనని ప్రజల్లోనూ భయాందో ళనలు నెలకొన్నాయి.