-వైకాపా అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విశాఖపట్టణంలో వైకాపా అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జీవీఎంసీ 65వ వార్డు నివాసి జలుమూరి రాధపై అదే వార్డు వైసీపీ అధ్యక్షుడు మొదలవలస లోకనాథం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం చాలా దారుణం. జగన్ రెడ్డి పాలనలో సొంత తల్లి, చెల్లికే రక్షణలేదు. రాధలాంటి సామాన్య మహిళలకు ఇంకెక్కడిది రక్షణ? ఇంటిపట్టాకి లంచం ఎందుకు ఇవ్వాలని నిలదీసిన రాధను వైసీపీ నేత లోకనాథం సజీవదహనం చేయాలనుకోవడం, రాష్ట్రంలో వైకాపా అరాచకాలకు అద్దం పడుతోంది.నిందితుడైన లోకనాథం, ఆయనకు సహకరించిన వైసీపీ నేతలను తక్షణమే అరెస్టు చేయాలి. కాలిన గాయాలతో ఉన్న బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాలి.