పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్ అండ్ కో ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం తిమ్మనగూడెంలో జగన్ సామంతరాజు, వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిన్న ప్రచారానికి వెళ్లిన సమయంలో బీసీ యువకులు పిప్పర దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు పంచాయతీ బెంచ్ పై కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. మేం ప్రచారానికి వస్తే లేచి నిలబడి గౌరవించకుండా దర్జాగా కూర్చుని చేతులు ఊపుతారా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోపంతో ఊగిపోతూ విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. నాకు తెలిసి శతాబ్దాల క్రితం రాచరికంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఎవరు అసలుసిసలైన పెత్తందారులో ఇప్పుడైనా అర్థమవుతోందా రాజా?!