మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పం

మీ బిడ్డలా ఆదరించండి…అభివృద్ధి చేసి చూపిస్తాడు
జగన్‌ ఐదేళ్ల పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధి శూన్యం
ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌

తాడేపల్లి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పమని, గెలిపిస్తే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణం పొలకంపాడులో నారా లోకేష్‌ కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గారపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎవరితో మాట్లాడిన నారా లోకేష్‌కే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ అరాచకపాలనతో ప్రజలు విసుగెత్తిపో యారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, చంద్రబాబు హయాంలో 73 శాతం శాతం పూర్తి చేసిన పోలవరం పనులను నిలిపేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటున్న నారా లోకేష్‌ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి మణి, నందమూరి దీపిక, కంఠమనేని శ్రీనివాస్‌ ప్రసాద్‌, డి.కవిత ప్రసాద్‌, డి.ప్రసాద్‌, గౌరినేని చంద్ర, గౌరినేని శాంతి, వల్లూరిపల్లి దుర్గాప్రసాద్‌, వల్లూరిపల్లి శారద పాల్గొన్నారు.