‘ల‌వ్ మీ’ ఓ ఛాలెంజింగ్‌ స్ర్కిప్ట్‌ – నిర్మాత దిల్ రాజు

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ‘‘ఆశిష్ హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసింగ్ పర్సనాలిటీ. ఇలాంటి యంగ్ హీరో ఈ బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేస్తే మంచి ఫ‌లితం రావ‌టం త‌థ్యం. ఇది త‌న‌కు బిగినింగ్ మాత్ర‌మే. డైరెక్ట‌ర్ అరుణ్‌ని క‌లిశాను. కొత్త వాళ్ల‌తో సినిమా చేసే ధైర్యం దిల్ రాజు అండ్ కో మాత్ర‌మే సాధ్యం. యంగ్ టీమ్‌కి కీర‌వాణిగారు, పి.సి.శ్రీరామ్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్‌తో ప‌ని చేసే అవ‌కాశం రావటం వారికి ద‌క్కిన అదృష్టం.బేబీలో ఓ ఊపు ఊపేసిన వైష్ణ‌వి చైత‌న్య ల‌వ్‌మీలో చ‌క్క‌గా న‌టించింద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మైంది. ఆల్ ది బెస్ట్ టు ల‌వ్ మీ టీమ్‌’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ర‌వికిర‌ణ్ కోలా మాట్లాడుతూ ‘‘లవ్ మీ’ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. కీర‌వాణి, పి.సి.శ్రీరామ్ వంటి లెజెండ్స్ తోపాటు దిల్ రాజుగారి వంటి బ‌లం కొత్త ద‌ర్శ‌కుడైన అరుణ్ వెనుక నిల‌బ‌డింది. క‌చ్చితంగా ఓ కొత్త సినిమా వ‌స్తుంద‌ని టీమ్ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజునే అనిపించింది. ట్రైల‌ర్ చూస్తే అది అర్థ‌మ‌వుతుంది. ఆశిష్‌గారు డిఫ‌రెంట్ సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. ఇంకా గొప్ప సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. బేబి త‌ర్వాత వైష్ణ‌విగారికి మ‌రో పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. హ‌ర్షిత్, అన్షిత స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ భీమ‌వ‌ర‌పు మాట్లాడుతూ ‘‘సినిమాతో ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన జ‌ర్నీ, హ‌డావుడి అన్నింటినీ ఇక మిస్ అవుతున్నాం. దిల్ రాజుగారితో అనుబంధాన్ని మ‌ర‌చిపోలేను. తొలి ద‌ర్శ‌కుడినైనా ఈ ప్ర‌యాణంలో చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. కీర‌వాణిగారి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్క్ చేయ‌టం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. ఆశిష్‌గారైతే ఏడు గంట‌ల‌కు మేక‌ప్‌తో రెడీగా ఉండేవారు. నా వెనుక బ్యాక్ బోన్‌లా నిలిచారు. అర్జున్ పాత్ర‌లో ఆయ‌న అద్భుతంగా చేశారు. ఆశిష్‌గారు ప్ర‌తీ విష‌యాన్నిముందుగానే నేర్చుకుని సెట్స్ కి వ‌చ్చేవారు. డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేవారు. ల‌వ్ మీ ఇఫ్ యు డేర్‌కి సీక్వెల్‌గా కిల్ మీ ఇఫ్ యు ల‌వ్ అనే సీక్వెల్ కూడా ఉంది. త్వ‌ర‌గా ఆయ‌న‌తో దాన్ని స్టార్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దిల్ రాజు, శిరీష్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఈ మూవీలో ప్రియ అనే పాత్ర రాసుకునే స‌మ‌యంలో వైష్ణ‌వి చైత‌న్య‌నే అనుకున్నాను. సినిమా స్టార్ట్ చేసే స‌మ‌యానికి ఆమె బేబి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. త్వ‌ర‌లోనే మీ అంద‌రితో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత నాగ‌గారితో చేసిన ప్ర‌యాణం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. మే 25న ఆడియెన్స్ ఓ మ్యాజిక్‌ను చూడ‌బోతున్నారు. పి.సి.శ్రీరామ్‌గారికి, చంద్ర‌బోస్‌గారికి థాంక్స్‌. నిర్మాత‌లు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌గారికి థాంక్స్‌. క‌థ విన‌గానే వాళ్లు నా వెనుక నిల‌బ‌డినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. నాకు స‌పోర్ట్‌గా నిలిచిన టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ ‘‘సాధారణంగా నాన్ లీనియర్ నెరేషన్ అంటే అర్థం తెలియ‌ని ద‌ర్శ‌కులుండ‌రు. అటువంటిది అరుణ్ భీమ‌వ‌రపు.. ల‌వ్ మీ సినిమాతో నాన్ లీనియ‌ర్ నేరేష‌న్‌కు కొత్త నిర్వ‌చ‌నాన్నిచ్చారు. చాలా డీప్‌గా వెళ్లారు. ఈ సినిమాను మా చిన్నాన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు, నా మిత్రుడు డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు చూసి వాళ్ల అభిప్రాయాన్ని చెబుతార‌ని ఆశిస్తున్నాను. డైరెక్ట‌ర్ అరుణ్‌, నిర్మాత నాగ‌ల‌కు అభినంద‌న‌లు. జ‌ర్నీని మ‌ర‌చిపోలేం. దిల్ రాజుగారు ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు తీశారు. ఈ సినిమా విష‌యంలో ఇచ్చిన సల‌హాలు ఎంత‌గానో వ‌ర్క్ అయ్యాయి. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య మాట్లాడుతూ ‘‘లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా కోసం అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆ క‌ష్టం చూసి చాలా మోటివేట్ అయ్యాను. ద‌ర్శ‌కుడు అరుణ్‌గారు చాలా మైండ్‌ఫుల్ ప‌ర్స‌న్‌. చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఆయ‌నకున్న నాలెడ్జ్‌ను ఈ సినిమా రూపంలో డైలాగ్స్ రూపంలో పెట్టారు. రాజుగారు, శిరీష్‌గారు, హ‌ర్షిత్‌, హ‌న్షిత‌గారికి థాంక్యూ. కీర‌వాణిగారు మా సినిమాకు సోల్‌. సినిమా తీయ‌టం ఒక ఎత్తైతే. ఆయ‌న మ్యూజిక్ చేయ‌టం మ‌రో ఎత్తు. ఆశిష్ మంచి కోస్టార్‌. త‌నతో వ‌ర్క్ చేస్తుంటే లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్‌గా ఫీల్ అయ్యాను’’ అన్నారు.

హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘మే 25న థియేటర్స్‌లో మా ల‌వ్ మీ సినిమా మాట్లాడుతుంది. మంచి,డిఫ‌రెంట్ మూవీ చేశామ‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కీర‌వాణిగారు మా సినిమాకు వ‌ర్క్ చేయ‌టం మా అదృష్టం. పి.సి.శ్రీరామ్‌గారు క్రేజీ విజువ‌ల్స్ ఇచ్చాను. నేను, నాగ‌, అరుణ్ క‌లిసి ఈ సినిమాకు చేసిన జ‌ర్నీని మ‌ర‌చిపోలేం. అల్లు అర్జున్‌, సుకుమార్‌, దిల్ రాజు ఎలాగైతే ఆర్య‌తో జ‌ర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడీ స్టేజ్‌కు ఎలా చేరుకున్నారో.. ఇర‌వైయేళ్ల త‌ర్వాత మ‌నం కూడా అలాగే అవుతామ‌నిపిస్తుంది. అయితే మ‌నం చాలా క‌ష్ట‌ప‌డాలి. క‌చ్చితంగా ఈ సినిమాతో మ‌నం కొడుతున్నాం. సినిమాను మే 25న థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘నాది, శిరీష్, లక్ష్మ‌ణ‌గారి జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డో ఆటో మొబైల్ ఫీల్డ్ నుంచి వ‌చ్చి సినిమాపై ఆస‌క్తితో డిస్ట్రిబ్యూట‌ర్‌గా ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేశాం. హ‌ర్షిత్ మంచి స్టూడెంట్.. వాళ్ల‌మ్మ‌గారు బాగా చ‌దువుకోవాల‌ని కోరుకుంది. త‌నకు సినిమాపై ఉన్న ఆస‌క్తితో యు.ఎస్‌కు వెళ్లి సినిమా గురించి నేర్చుకుని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. మా థియేట‌ర్స్ అకౌంట్స్ చూసుకోవ‌టానికి ఎంబీఏ చ‌దివిన హ‌న్షిత.. సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. అలా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ స్టార్ట్ చేశాం. ఆశిష్ చిన్న‌ప్ప‌టి నుంచి బాగా డాన్సులు చేస్తుండేవాడు. అవి చూసి మేం త‌ను హీరో అవుతాడ‌ని అంటుండేవాళ్లం. ఓ రోజు త‌నొచ్చి హీరో అవుతాన‌ని అన్నాడు. హీరో కావ‌టం అంటే అంత సుల‌భం కాద‌ని చాలా క‌ష్ట‌ప‌డాల‌ని చెప్పాం. ఐదేళ్లు సినీ యాక్టింగ్‌కు సంబంధించి అన్నీ విష‌యాలు నేర్చుకున్నాడు. రౌడీ బాయ్స్‌తో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ల‌వ్ మీ త‌న‌కు రెండో సినిమా. మేం ఇర‌వైయేళ్లుగా క్రియేట్ చేసిన‌దాన్ని నిల‌బెడుతూ వాళ్లు నిల‌బ‌డ‌టం అనేది వాళ్ల ముందున్న ఛాలెంజ్‌. రాత్రిప‌గ‌లు క‌ష్ట‌ప‌డాలి. ఇప్పుడంతా సుల‌భం కాదు. హ‌ర్షిత్, హ‌న్షిత స‌క్సెస్ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలి. క‌థ ద‌గ్గ‌ర నుంచి రిలీజ్ వ‌ర‌కు అన్నింటినీ మేనేజ్ చేసి స‌క్సెస్‌ఫుల్ సినిమా ఇవ్వాలి. ఆశిష్ కాన్ఫిడెన్స్ సూప‌ర్బ్‌. ఆర్య‌తో త‌ను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను నేను ఊహించ‌లేదు. అల్లు అర్జున్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఆడియెన్స్‌ను శాట‌స్ఫై చేయ‌టం ఇప్పుడంత సుల‌భం కాదు. ప్రేక్ష‌కుల‌ను గెల‌వ‌ట‌మే ఆశిష్ ముందున్న ఛాలెంజ్‌. క‌ష్ట‌ప‌డితే ఓ రోజు ఆశిష్ త‌న ల‌క్ష్యాన్ని రీచ్ అవుతాడు. నాకు సినిమా త‌ప్ప మ‌రేదీ తెలీదు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ స్టార్ట్ చేసేట‌ప్పుడు .. ఆ బ్యాన‌ర్‌లో చేసేదేదైనా యూనిక్‌గా చేయాలని అనుకున్నారు. బ‌లగం అలాగే చేశాం. ల‌వ్ మీ కూడా డిఫ‌రెంట్ సినిమా. ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌. అరుణ్ సినిమాను డ్రైవ్ చేసిన విధానం సూప‌ర్బ్‌. కొత్త‌గా సినిమాను ట్రై చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ క‌లిసి ఫైన‌ల్ అవుట్ ఇచ్చారు. కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు ల‌వ్ మీ సినిమా బాగా నచ్చుతుంది. ప్రేక్ష‌కులు సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం. కీర‌వాణిగారు సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం. కొత్త‌వాళ్లైనా ప‌ది పాట‌లు అడిగితే అన్నీ ఇచ్చారు. అందులోనుంచి ఐదు పాట‌లు తీసుకున్నాం. పి.సి.శ్రీరాంగారికి థాంక్స్‌. ఇత‌ర టీమ్‌కు థాంక్స్‌. ఈ బ్యాన‌ర్ నుంచి బ‌ల‌గం, ల‌వ్ మీ సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల‌ను కొత్త ద‌ర్శ‌కులే చేశారు. భ‌విష్య‌త్తులో హ‌రి, శాండి, శ‌శి, ర‌వికిర‌ణ్ స‌హా మ‌రో ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ నుంచి కొత్త సినిమాల‌ను, కొత్త ద‌ర్శ‌కుల‌ను అందించాల‌నే చూస్తాం. అదే మా కోరిక‌. కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే ఈ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. ల‌వ్ మీ విష‌యానికి వ‌స్తే రేపు యు.ఎస్‌లో ప్రీమియ‌ర్స్ వేస్తున్నాం. క‌చ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.