మాచర్ల, మహానాడు : మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల అల్లర్ల నేపథ్యంలో గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గన్‌మెన్లను కూడా వది లేసి పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. దీనిపై పిన్నెల్లి స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు.