మడకశిర, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మడకశిర మండలం గంగువాయి పాళ్యం, గోవిందపురం పంచాయ తీలలో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, మడకశిర ఇన్‌చార్జ్ తిప్పేస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.