కర్నూలు, మహానాడు : ఎస్సీ వర్గీకరణకు అండగా ఉండటమే కాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు అని ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు.
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆగస్టు 16న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞతా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగల కృతజ్ఞతా యాత్ర పోస్టర్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేంపార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కర్నూలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ధరూర్ జేమ్స్ ఆధ్వర్యంలో పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పోలిట్ భ్యూరో సభ్యులు, మాజీ డిప్యూటీ సి.ఎం కె.ఇ.కృష్ణమూర్తి, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.