దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: మద్య నిషేధంపై మాట తప్పి వైసీపీ తీరని ద్రోహం చేసిందని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. దర్శి`కురిచేడు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యనిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి పేదల జీవితాలను నాశనం చేశారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ మాడపాకుల శ్రీను, బీజేపీ నాయకులు తిండి నారాయణరెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు.