3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం

తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుపతి లోని తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో ఈవో చర్చించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.