నిజాల నిలువుటద్దం మహానాడు

– అదిరేది బెదిరేది లేదు
-రఘురామరాజు పోరాటమే మాకు స్ఫూర్తి
-మహానాడు ఎండి బోడేపూడి సుబ్బారావు
-మహానాడు ఈ పేపర్ ఆవిష్కరణలో ప్రముఖుల సందేశం

ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొన్న తీరు చూసి తాను మీడియా పెట్టాలనే స్ఫూర్తి పొందానని మహానాడు మీడియా చైర్మన్ బోడేపూడి వెంకట సుబ్బారావు చెప్పారు.

శుక్రవారం సాయంత్రం జరిగిన మహానాడు ఈ పేపర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ తాము నెలకొల్పిన మీడియా కి మహానాడు పేరు సముచితమని భావించి ఆ పేరు పెట్టడం జరిగిందని అన్నారు. మహానాడు ఈ పేపర్,డిజిటల్ మీడియా తో పాటు శాటిలైట్ ఛానల్ నెలకొల్పేoదుకు కృషి చేస్తున్నామన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ మహానాడు వాస్తవాలు రాస్తూ ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నానన్నారు. మాజీ ఐ ఏఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ నిజాయితీ నిబద్దత కలిగిన యాజమాన్యం, పాత్రికేయుల సారధ్యoలో మహానాడు తప్పక విజయవంతం అవుతుందన్నారు.

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఎంత కష్టానికైనా ఎదురొడ్డి నిలిచి విలువలతో కూడిన జర్నలిజాన్ని చెయ్యాలని మహానాడు మీడియా ని కోరుతున్నానన్నారు. ప్రముఖ న్యాయవాది రవితేజ మాట్లాడుతూ నిష్ణాతులు కలిసి పని చేసి సమాజానికి మంచిచేసే మీడియాని తయారుచేయాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ మాట్లాడుతూ వ్యవస్థ లో లోపాలను ఎత్తిచూపే విధంగా జర్నలిజం వుండాలని, మహానాడు ఆ దిశలో పనిచెయ్యాలని అకాoక్షిoచారు. మహానాడు అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ అన్నారు.

మహానాడు ఈ పేపర్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిఖార్సయిన జర్నలిజం విలువలతో మహానాడు మీడియా ని నడుపుతామని, ఆ క్రమం లో ఎవరికీ అదిరేది, బెదిరేది, భయపడేది లేదన్నారు.