-కుందేళ్ల చప్పుడుకు భయపడేది లేదు
-పైరవీలతో పదవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు
-అందరి నిర్ణయం మేరకు బీజేఎల్పీ పదవి దక్కింది
-మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా?
-పౌరసరఫరాలో అవినీతిని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్
-19 ప్రశ్నలలో ఒక్క దానికే సమాధానం చెప్పావు
-సిట్టింగ్ జడ్జితో విచారణ, సీబీఐతో దర్యాప్తు చేయించాలి
-ఉత్తమ్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఫైర్
హైదరాబాద్, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. నేను చేసిన ఆరోపణలపై ఇన్ని రోజులకైనా మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలు. నేను పౌరసరఫరా శాఖలో అవినీతిపై 19 ప్రశ్నలతో సీఎంకు లేఖ రాశాను. ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ సమా ధానం చెప్పారు..అయినా సంతోషమే. అయితే నాపై వ్యక్తిగత విమర్శలను ఖండి స్తున్నట్లు చెప్పారు. పైరవీ చేసి బీజేఎల్పీ పదవి తెచ్చుకున్నానని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పైరవీలు చేయడానికి ఇది కాంగ్రెస్ కాదు…బీజేపీలో అందరి సమన్వయంతో బీజేఎల్పీగా నాకు అవకాశం కల్పించారు. మీరు పీసీసీ ఎలా తెచ్చు కున్నారో నాకు తెలీదా? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను. మా అధ్యక్షుడి అనుమతితోనే నేను సీఎంను కలవడానికి వెళ్లాను. దాన్ని కూడా అనుమానపడేలా మాట్లాడితే అది మీ సీఎంను అవమానించడమే అవుతుంది. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ పై మాట్లా డినప్పుడు స్పందించలేదు..యు ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతుంది.
డి ఫాల్టర్ల పేర్లను బయటపెడతారా?
బకాయిలు ఉన్న రైస్ మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. డి ఫాల్టర్ల పేర్లను బయటపెడతారా? అని ప్రశ్నించారు. తరుగుపై మంత్రి ఏనాడైనా క్షేత్రస్థా యిలో ఎపుడైనా పరిశీలించారా? కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు ? 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 4 కంపెనీలకు అప్పజెప్పారు. మీకు ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువు మే 15న ముగిసింది. ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువు కంటే కాంట్రాక్టర్లకు మరో నాలుగు నెలలు అదనపు సమయం ఇవ్వడం ఏమిటి? 90 రోజుల్లో ధాన్యం లిఫ్ట్ చేయని కాంట్రాక్టర్ల మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? రైస్ మిల్లర్లకు భయపెట్టి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంది వాస్తవం కాదా? మిల్లర్లు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ బయట పెడుతున్నా గడువు ముగిసినా ఒక్క బస్తా ధాన్యం కూడా ఎఫ్‌సీఐకి ఇవ్వలేదు..దీని వెనకున్న మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు.
కుందేళ్ల చప్పుడుకు భయపడను
నేను రాజకీయంగా మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు చాలా నష్టపోకతప్పదని హెచ్చరించారు. ఇది బాగోదు జాగ్రత్త…వేలెత్తి చూపిస్తే మీ కుందేళ్ల చప్పుడుకు ఇక్కడ ఎవరు భయప డరని హితవుపలికారు. పౌరసరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సీబీఐకి అప్పగించాలని కోరారు. ఆ శాఖలో జరిగిన అవినీతిపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చప్పారు.