నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

`గుంటూరు రోడ్డు రంగా విగ్రహం నుంచి ర్యాలీ
`నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
చదలవాడ అరవిందబాబు పిలుపు

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తాను, పార్లమెంట్‌ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు నామినేషన్‌ వేస్తున్నా మని ఈ కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డులోని రంగా విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. కూటమి అభ్యర్థులుగా బరిలో నిలిచిన ప్రజాస్వామ్య వాదులకు అండగా నిలవాలని కోరారు. మన నియోజక వర్గం మన బాధ్యతగా ప్రతి పౌరుడు, రాజకీయ నాయకుడు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. నియోజ కవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటామని తెలిపారు.

భారీ మెజారిటీతో కూటమి సభ్యులను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరారు. ఒకే వ్యక్తిని పదేళ్లు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోబెట్టిన నియోజకవర్గంలో కనీస అభివృద్ధి లేదని, పై పెచ్చు భూ ఆక్రమణలు, దోపిడీలు తీవ్రమయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని కన్న బిడ్డలా సాకే కూటమి అభ్యర్థులను గెలిపించుకుని అభివృద్ధి బాటలో అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. జనసేన ఇన్‌చార్జ్‌ సయ్యద్‌ జిలాని మాట్లాడుతూ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, పార్లమెంట్‌ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్‌ ప్రక్రియను నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థులు విజయవంతం చేయాలని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఏ స్థాయిలో ఉంటుందో ఈ ర్యాలీతో చూపించి అధికార పక్షానికి సవాల్‌ చేద్దామని పిలుపునిచ్చారు.