మాలల ద్రోహి జగన్‌..ఐదేళ్లలో చేసింది శూన్యం

-వారికి మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
-వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మిద్దాం
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: వైసీపీని ఓడిద్దాం…అమరావతిని నిర్మించుకుందామని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజావేదికలో గుంటూరు ఆశీర్వాదం, ఏకుల రాజశేఖర్‌, పురం సుందర్‌రావు, దారా ముసలయ్య, కోట బండి మస్తాన్‌ రావు, కమిటీ సభ్యులు శనివారం ఏర్పా టు చేసిన మాలల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గొల్ల అరుణ్‌కుమార్‌, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నా మాట్లాడుతూ ఐదేళ్లలో దళితు లకు ఒరిగిందేమీ లేదన్నారు. దళితులను హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. అంబేద్కర్‌ పేరును విదేశీ విద్యకి తొలగించి నీ పేరు పెట్టుకుంటా వా జగన్‌ అని ప్రశ్నించారు. చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అని, 27 పథకాలు రద్దుచేసి ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు నవరత్నా లకు మళ్లించిన ఆయనకు ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. ఆయనను సాగనంపి సమాజం లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.