నాగర్‌కర్నూలు, మహానాడు : నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమా ర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.