యువతిని గదిలో బంధించి అత్యాచారం

హైదరాబాద్‌… బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించిన యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడు చిన్మయి సైక్యా (22)తో పరిచయం ఏర్పడింది. ఈ నెల 4న యువతి ఇంటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటపెడితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెసేజ్ చేసింది. అది చూసిన ఆమె వెంటనే బాధితురాలి సోదరికి చెప్పడంతో ఆమె అప్రమత్తమైంది. ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.