– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్..సమస్య ఉంటే పరిష్కరించేది లోకేష్
– 29 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువనేత
– నిస్వార్థంగా సేవలు…ఐదేళ్లుగా వారితోనే మమేకం
– నేటి విజయంతో శ్రమకు తగ్గ ఫలితం
అమరావతి: సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. సమస్య ఏదైనా, పరిష్కారాన్ని చూపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నారా లోకేష్ సాయమో, పలకరింపో, కానుకో అందుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సొంత నిధులు, దాతల సహకారంతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు లోకేష్ చేరువయ్యారు. నూతన వధూవరులకు పెళ్లి కానుక, మంగళగిరి, తాడేపల్లిలలో అన్నా క్యాంటీన్లు, చిరు వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లు, స్త్రీ శక్తి పేరుతో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ, సంజీవని ఆరోగ్యకేంద్రాలు/సంజీవని ఆరోగ్యరథóం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యసేవలు, యువ పేరుతో నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ, జలధార పేరుతో టాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, నారా లోకేష్ క్రీడా ప్రాంగణాల నిర్వహణ, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, రజకులకు ఇస్త్రీ బండ్లు, లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ద్వారా సేవలు, పురోహి తులకు, పాస్టర్లకు, ఇమామ్ -మౌజన్‌లకు పండుగ కానుకలు, నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు, రోడ్ల మరమ్మతులు, నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు, కార్మికుల కు వెల్డింగ్ మెషీన్లు, కొవిడ్ సమయంలో వైద్య సహాయం, టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయాలు, ఆర్‌ఎంపీలకు వైద్యసేవ పరికరాలు, వేసవిలో మజ్జిగ పంపిణీ కేంద్రాలు, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, ఎస్సీల వివాహానికి తాళిబొట్టు, సోదరీ మణులకు రాఖీ కానుక, చేనేతలకు రాట్నాల పంపిణీ, నిరుపేదలు మృతి చెందితే వారి కుటుంబాలకు మట్టి ఖర్చులు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ వంటి సాయాలు ప్రజలకు అందించి నిస్వార్థంగా సేవలు అందించారు. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే ఒక నియోజకవర్గంలో ఇన్ని సంక్షేమ పథకాలు సొంత నిధులతో అందించిన నేతలు లేరు.