మంత్రి డోలాను కలిసిన పలువురు ముఖ్య కార్యదర్శులు

వెలగపూడి :  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాల, వాలంటీర్ల శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.కన్నబాబు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.సూర్యకుమారి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన పలు అంశాలపై మంత్రితో విడి విడిగా చర్చించారు.