వికారాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల ఆస్తినష్టం

హైదరాబాద్‌, మహానాడు: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్య గూడా రోడ్డు దానప్ప ఆసుపత్రి పక్కన ఉన్న నాగలక్ష్మి హార్డ్‌వేర్‌ షాపులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఉదయం 4 గంటల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక సీఐ నాగరాజు పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మున్సిప ల్‌ చైర్మన్‌ మంజుల రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మున్సిపల్‌ సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.