గుంటూరు వైసీపీలో ముసలం!

– భారీగా కార్పొరేటర్ల రాజీనామాలు

గుంటూరు, మహానాడు: నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒకరితర్వాత ఒకరు ఆ పార్టీకి రాజీనామాలు సమర్పిస్తున్నారు. దీంతో అక్కడి నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కసారిగా ఈ రాజీనామాలతో నగరంలో రాజకీయ ఉత్కంఠ ఏర్పడింది. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో కార్పొరేటర్లు జనసేన పార్టీ లో చేరనున్నారు.

రాజీనామాలు చేసిన వారిలో నిమ్మల వెంకట రమణ, సంకూరి శ్రీనివాసరావు, యిర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ, కో-ఆప్షన్ సభ్యరాలు మహమ్మద్ సాజిద భాను తదితరులు ఉన్నారు. మరికొందరు ఇదే బాటలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం.