– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్
విజయవాడ, మహానాడు: మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో ముమ్మరంగా సాగుతున్న సహాయ చర్యలు. వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు పెద్దఎత్తున కదిలివస్తున్న దాతలు. మంత్రిని కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేసిన గుంటూరు లోటస్ ఇన్ ఫ్రా ప్రతినిధులు కె.వంశీ కృష్ణ, రాంబాబు, చిన్న అంకారావు, శ్రీనివాసరావు. ఏలూరుకు చెందిన ప్రవాస భారతీయులు మేకా వినయ్ బాబు, సామినేని పవన్ కుమార్ (గోళ్ళమూడి) రూ.10లక్షల విరాళం అందజేత. సిటీ కేబుల్ ఎండీ సాయి రూ.5 లక్షలు అందజేశారు. పెద్దఎత్తున స్పందిస్తున్న దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు.
వరద తగ్గుముఖం
కృష్ణానదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత ప్రవాహం 3,23,552 క్యూసెక్కులు. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి కూడా పనులు కొనసాగించాలని ఆదేశించారు. డ్రోన్ లైవ్ లో చూస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న లోకేష్.
గోదావరికి భారీ వరద
గోదావరిలోకి భారీగా వరద వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రస్తుత వరద ప్రవాహం 6,74,935 క్యూసెక్కులు. భద్రాచలం నుంచి గోదావరిలోకి వస్తున్న ప్రస్తుత ప్రవాహం 9,71,134 క్యూసెక్కులు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి.