మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న ఈ చిత్రంలో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు, యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కథ డిఫరెంట్ టైమ్స్ లో సెట్ చేయబడింది. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు మేకర్స్ తెలియజేస్తారు.
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓపెనింగ్ బ్రాకెట్ టీజర్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా చూపింది. నవీన్ చంద్ర, పి రవి శంకర్ వంటి కొన్ని ముఖ్యమైన పాత్రలను కూడా పరిచయం చేసింది. ఈ చిత్రానికి ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.