సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి. ‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే విడుదలైన ‘కృష్ణమ్మ’ మూవీ టీజర్, టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ అనే లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ‘కృష్ణమ్మ’ నిలవనుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.