– అధికారులకు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం
ఏలూరు: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మారేడుమిల్లిలో విహారయాత్రకు వెళ్లిన ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల గల్లంతుపై సమాచార పౌర సంబందాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి పార్థసారథి అల్లూరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పర్యటిస్తున్న మంత్రి పార్థసారథికి విద్యార్థుల గల్లంతు విషయం తెలిసిన వెంటనే ఏలూరు, అల్లూరి జిల్లా కలెక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని, గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.