ప్రధానిని కలిస్తే బిజెపి కి దగ్గర అయినట్టు కాదు

-ప్రజా సమస్యలపై చర్చ కు ప్రభుత్వం వెనక్కిపోదు
-అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ దే
-హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తాం
– తెలంగాణ శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: జులై 31తేదీ లోగా బడ్జెట్ కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలి.లేకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్ ని కోరింది.

అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం ఆలోచన. 3రోజుల్లో బడ్జెట్ పై చర్చ ను పూర్తి చేయాలి. మాజీమంత్రి హరీష్ రావు గారికి అన్నీ ప్రొసీడింగ్స్ తెలుసు. తిమ్మిని బమ్మిని చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు చూస్తున్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో సమయం ఉన్నా 8 రోజులు కన్నా ఎక్కువ సభను జరపలేదు.ఏ ఒక్క హామీని విస్మరించం.ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నాం.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ దే. ప్రజా సమస్యలపై చర్చ కు ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. డిమాండ్లపై చర్చ సమయంలో అన్ని అంశాలపై కూలంకుషంగా మాట్లాడవచ్చు.

లా అండ్ ఆర్డర్ , రుణ మాఫీ, స్థానిక సంస్థలు పై మాట్లాడే హక్కు బి ఆర్ ఎస్ కు లేదు. రైతు సమస్యలంటూ బిజెపి మొసలి కన్నీరు కారుస్తోంది. తెలంగాణ అవసరాల దృష్ట్యా ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణకు చట్ట ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించటంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైంది.

నిధులు విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తాం. విభజన చట్టానికి సంబంధించి ఎపి కి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంపై బిజెపి నేతలు ఒత్తిడి తీసుకురావాలి.

ప్రతిపక్షం అడిగిన ప్రతి అంశంపై చర్చిస్తాం. ప్రధాని ని కలిస్తే బిజెపి కి దగ్గర అయినట్టు కాదు. బిజెపి బి ఆర్ ఎస్ కలిసినట్టు బిజెపి కాంగ్రెస్ కలవదు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తాం.సిఎం కూడా స్పందిస్తారు. ప్రతిపక్ష ఆరోపణలు సత్య దూరం. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రగతిశీల తెలంగాణకు నష్టం చేయవద్దని కేంద్రాన్ని కోరుతున్నాం.