బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు.