బెంగళూరు: రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీస్ ఉన్నతాధి కారులు మరో ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఎస్సై వివరణ ఇవ్వాలని ఎస్పీ మల్లిఖార్జున్ మెమో ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిం చిన ఏఎస్సై నారాయణస్వామి, కానిస్టేబుళ్లు దేవరాజ్, గిరీష్‌పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. రేవ్ పార్టీపై సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహ రించినందుకు వారిని సస్పెండ్ చేశారు.