వైసీపీ నుంచి వలసలే కూటమి విజయ సంకేతాలు

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
అప్పాపురానికి చెందిన 70 కుటుంబాల చేరిక

పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు:తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్న చేరికలే కూటమి విజయ సంకేతాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మునిగిపోయే నావలా మారిన వైసీపీ కంటే, చంద్రబాబు సంక్షేమ నీడలో ఉండడమే మేలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉందన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన ఉప సర్పంచ్‌, నాదెండ్ల మండల వైసీపీ మెనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు మాబు సుభానితో పాటు 70 కుటుంబాల వారు వైసీపీని వీడి గురువారం ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరి పేటలోని ప్రత్తిపాటి నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారా యణ, అప్పాపురం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేసి తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించాలని పిలుపునిచ్చారు.