మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు

-నందిగామ నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు
-వైసీపీపై వ్యతిరేకతతోనే చేరుతున్నారన్న తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామ నియోజకవర్గంలో మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య కి మద్దతుగా ఆయా వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. తాజాగా నందిగామ పట్టణం 7, 9 వార్డులకు చెందిన వైసీపీ కుటుంబాలు, రైతుపేట ముఠా మండవ పిచ్చయ్య, మువ్వా శేషగిరిరావు, కొమ్ము ప్రసాద్‌ (సిమెంటు కొట్టు) ఆధ్వర్యంలో బుధవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తంగిరాల సౌమ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారిపై నమ్మకం లేకపోవటం, మొండితోక వసూల్‌ బ్రదర్స్‌ అసమర్థత, చేతగానితనం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.