ఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీ!

– సుమారు రూ. 100 కోట్లు నష్టం

విజయవాడ, మహానాడు: స్థానిక విజయ డెయిరీ పాల ఫ్యాక్టరీ ఇంకా వరద నీటిలోనే నానుతోంది. దీంతో సుమారు వంద కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. వారం కింద ఐదు అడుగుల ఉన్న నీరు మంగళవారానికి రెండు అడుగులకు తగ్గింది. ఈ ఫ్యాక్టరీ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. డెయిరీ లో పాలు, పెరుగు, బటర్‌ ప్రాసెసింగ్ యూనిట్లు పాడైపోయినట్టు సిబ్బంది తెలిపారు. భారీగా ఉత్పత్తి అయిన పాలు, పెరుగు, బట్టర్ మిల్క్ పాడైపోయాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్యాక్టరీ నుంచి రోజుకు నాలుగు లక్షల పాలు ఉత్పత్తి జరిగేదని, 2 లక్షల పాలు విరవల్లి నుంచి జరిగేదని వారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ కి వరద నీరు రావడంతో 6 లక్షలు విరవల్లి నుంచే ఉత్పత్తి జరుగుతుందన్నారు. అయితే, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలను విరవల్లి నుంచి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. కాగా, యంత్రాలకు సిబ్బంది మరమ్మతు చేస్తోందని యాజమాన్యం తెలిపింది. గత వారం రోజుల నుంచి కరెంట్ లేదని, వరద వల్ల 600 మంది ఉపాధి కోల్పోయారని ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు.