– ఘన నివాళులర్పించిన మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
న్యూఢిల్లీ: అనునిత్యం దేశ సేవలో తరించిన కార్యశీలి, ప్రతిక్షణం భరతమాతను స్మరించిన భాగ్యశాలి, నిరాడంబరుడు, అజాత శత్రువు, సహనం ఆయన ఆయుధం, శాంతం ఆయన ఆభరణంగా కలిగిన మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజపేయి వర్ధంతి న్యూఢిల్లీలో శుక్రవారం జరిగింది. పార్టీ నాయకులు, సహచర కేంద్ర మంత్రిలతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో వారి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వాజపేయి నాలాంటి అనేకమంది కార్యకర్తలకు మార్గదర్శి… దేశం కోసం వారు అందించిన సేవలు మరువలేనివి… వారి జీవితం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.