ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

బాపట్ల, మహానాడు: కారంచేడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కోటి సొంత నిధులతో నిర్మించనున్న మరో ఆర్వో వాటర్ ప్లాంట్ పనులకు పురందేశ్వరి భూమిపూజ చేశారు. ఆర్వో నిర్మాణం కోసం రాంకీ గ్రూప్ సంస్థకు 1 కోటి రుపాయిల చెక్కును దగ్గుబాటి హితేష్ చెంచు రామ్ అందజేశారు. ఇదిలావుండగా, పలువురు నేతలు పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరిని ఆమె పార్టీ కండువా వేసి, ఘనంగా ఆహ్వానించారు.