అత్యంత బిజీ షెడ్యూల్లోనూ గుంటూరు వరకు వెళ్లి పరామర్శ
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వ్యక్తిగత గన్ మెన్ తండ్రి వైద్యానికి భరోసా
గుంటూరు: బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన మానవతా దృక్పథాన్ని చాటుకుని మనసున్న మనిషి అనిపించుకున్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర. తన వ్యక్తిగత గన్ మెన్ వినోద్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ గుంటూరు ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఉదయం అన్న క్యాంటీన్ ప్రారంభంలో పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అందరికీ దగ్గరుండి వడ్డించి, వారి ఆకలి తీర్చారు. పలువురు పిల్లలకు ముద్ద కలిపి తినిపించారు. అనంతరం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. అయినప్పటికీ తన సిబ్బంది విషయంలో తాను చూపించే ప్రేమాభిమానాలకు కొలమానంగా ఈ ఘటన నిలిచింది.
సాక్ష్యాత్తు రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సామాన్య భద్రతా సిబ్బంది దగ్గరకు వచ్చి భరోసా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు భద్రతా సిబ్బంది కూడా మంత్రి వచ్చి పరామర్శించడం, భరోసా కల్పించడం చూసి ఆశ్చర్యంతో మాట రాకుండా పోయిందని వాపోయారు.