బోనాల ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి ఆరా
హైదరాబాద్, మహానాడు: రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు బోనాల ఉత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి బోనాల ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులు వస్తారని, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ నెల 28వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బోనాల కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ బాలాజీతో పాటు, ఆలయ ట్రస్టీ కుమారి శశికళ, సూర్యప్రకాశ్, జానకి శరణ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.