గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించామని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. https://ganeshutsav.net ద్వారా వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్ సైట్ ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాట్టు మంత్రి తెలిపారు.