అమరావతి, మహానాడు: మాల్టా దేశంలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సాధియాకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సాధియా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాధియా అల్మాస్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.3 లక్షలు సాయన్ని ఇటీవల టీడీపీ నాయకుల ద్వారా మంత్రి నారా లోకేష్ అందజేసిన విషయం విదితమే.