విశాఖపట్నం, మహానాడు: తనపై సాక్షి పత్రిక రాసిన కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనం రాసిందని నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారని మంత్రి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సాక్షిపై మంత్రి లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. శుక్రవారం మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు.