పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ విదేశీ టూర్

– గొట్టిపాటి లక్ష్మీ

దర్శి, మహానాడు: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారని, నిర్విరామంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయటం అభినందనీయమని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, శాన్ ఫ్రాన్సిస్కో లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌ తో పాటు అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా నారా లోకేష్ కోరారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి లోకేష్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో కూడా చంద్రబాబునాయుడు ఇలానే ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అనేక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొని రాగలిగారని, హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవని, చంద్రబాబు నాయుడు తీవ్ర కృషి తోనే నేడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించారని, త్వరలోనే అమరావతి కుడా దేశం లోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారుచేస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు. ఆ దిశగానే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో వేగంగా అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. తల్లీచెల్లికి అన్యాయం చేసిన జగన్‌ వైఖరి వల్ల మనస్తాపానికి గురై, మీడియా ఎదుట షర్మిల కన్నీరు పెట్టుకుంటే, దాని నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి వారి కుటుంబ సమస్యను చంద్రబాబు నాయుడు కు అంటగట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ లక్ష్మి విమర్శించారు.