తెనాలి, మహానాడు: వైకుంఠపురంలో జరిగిన మహా యాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం మంత్రి సోమవారం నిర్వహించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.