Mahanaadu-Logo-PNG-Large

సీఎం చంద్ర‌బాబునాయుడు కటౌట్‌కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయ‌ణ‌

– ఫించ‌నుదారుల చేత చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయ‌ణ‌
– వెంక‌టేశ్వ‌ర‌పురంలో ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్లు పంపిణీ చేసిన నారాయ‌ణ‌, కోటంరెడ్డి

జులై 1వ‌తేదీ వృద్ధాప్య‌, వితంతువుల‌కు ఫించ‌ను రూ. 7000, దివ్యాంగుల‌కు రూ. 6000 రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అంద‌చేసిన సంద‌ర్భంగా…నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని జ‌నార్ధ‌న్ రెడ్డి కాల‌నీలో… మాజీ కార్పొరేట‌ర్ జ‌హీర్ ఆధ్వ‌ర్యంలో… సీఎం చిత్ర ప‌టానికి పాలాభిషేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారుల చేత…సీఎం చంద్ర‌బాబు చిత్ర ప‌టానికి నారాయ‌ణ పాలాభిషేకం చేయించారు. అనంత‌రం నారాయ‌ణ‌, శ్రీ‌నివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ

మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి పాలాభిషేకం చేశారు. ముందుగా… వెంక‌టేశ్వ‌ర‌పురంలో ఇంటింటికెళ్లి…ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్ల‌ను నారాయ‌ణ‌, కోటంరెడ్డిలు పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.