Mahanaadu-Logo-PNG-Large

పారమ్మకొండ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి

– 1.60 కోట్ల నిధులతో అభివృద్ధి

పారమ్మకొండ రోడ్డుకు 1.60 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు. తాము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామని అన్నారు. పారమ్మకొండ రోడ్డుకు నిధులు వెంటనే మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అన్న క్యాంటీన్లు, పర్యాటక అభివృద్ధి ప్రాధాన్యత

మంత్రి సంధ్యారాణి త్వరలో పాచిపెంట, సాలూరు గిరిజన మండలాలకు అన్న క్యాంటీన్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా, పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.