సాలూరు, మహానాడు: రాష్ట్ర మహిళ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. మంత్రి గురువారం మెంటాడ మండలం పర్యటనకు వెళుతుండగా, రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఆ వాహనదారుడికి, నలుగురు కానిస్టేబుళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.