Mahanaadu-Logo-PNG-Large

పార్టీ కార్యాలయంలో మంత్రి సవిత

– మంత్రి సవితకు వర్ల సన్మానం

మంగళగిరి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన మొదటిసారే మంత్రిపదవి చేపట్టిన సంజీవరెడ్డిగారి సవిత మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంకు విచ్చేసి రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈందర్భంగా వర్లరామయ్య ఆమెను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు గురుతరమైన బాధ్యతను అప్పగించినట్లు.. మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన మంత్రి సవిత కు సూచించారు. రాజకీయంగా ప్రజా సేవలో తరించి.. ప్రజల మనసును, మనన్నలు చూరగొనాలని సూచించారు. మునుముందు రాజకీయంగా మరితంగా ఎదగాలని ఆకాంక్షించారు.

మహిళలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. మహిళా లోకానికి మంచి చేసి… మహిళాభివృద్ధికి తోడ్పడాలని వర్లరామయ్య మంత్రి సవితకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్ పాల్గొన్నారు.