వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు, మహానాడు :  ములుగు జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సీతక్క మాట్లాడారు. ములుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద పెరిగే పక్షంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా, చేపల వేటకు ఎవరు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీతక్క భరోసా ఇచ్చారు.