మంత్రి సురేఖకు అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేత

హైదరాబాద్‌, మహానాడు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయాస్తమ సేవలో భాగంగా నిర్వహించిన నవ చండీయాగ రక్షను ఆలయ అర్చకులు కొండా సురేఖకి అందించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మంత్రి నివాసంలో మంగళవారం అర్చకులు మంత్రి సురేఖకి అమ్మవారి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను అందించి, వేదాశీర్వచనం చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఈవో పురేందర్ కుమార్, ఇతర సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు.