చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట చంద్రబాబును కలిసిన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి
– మర్యాద పూర్వకంగానే కలయిక
– నాలుగోసారీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడిని అభినందించిన మంత్రి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి చంద్రబాబు నాయుడుని కలిశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో జరిగిన ఈ భేటీ కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉత్తమ్ దంపతులు అభినందించారు.