సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి శుభాష్

రామచంద్రపురం పట్టణం కొత్తూరు ఒకటో వార్డుకు చెందిన పార్వతిని రామాంజనేయమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి , రామచంద్రపురం శాసనసభ్యులు వాసంశెట్టి శుభాష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీ పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,62,000 మంజూరయ్యాయి. శనివారం రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ మంజూరైన చెక్కును లబ్ధిదారురాలుకు అందజేశారు. చెక్కును అందుకున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.