విజయవాడ : కృష్ణ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ కి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరద్దరూ కాసేపు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఉమ్మడి కృష్ణ జిల్లాల నుంచి భారీ మెజార్టీ వచ్చేందుకు చేయాల్సిన కృషి పై మాట్లాడుకున్నారు.